కమలాపూర్, తెలంగాణ గళం:
ఎవరి పరిసరాలను వారు పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛ కమలాపూర్ కోసం గ్రామస్తులందరూ కలిసి రావాలని పరిశుభ్రత అందరు బాధ్యత కావాలని కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి అన్నారు. కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్, పంచాయతీ పాలకమండలి ఆధ్వర్యంలో స్వచ్ఛ కమలాపూర్ లక్ష్యంగా ప్రతి శనివారం నిర్వహించే ఊరు కోసం ఒక్కరోజు శ్రమదానం కార్యక్రమం శనివారం 14 వ వార్డులో 21 వారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ గ్రామ సర్పంచ్ పాలకమండలి సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. రహదారులు ఊడ్చి, మురికి కాలువలు శుభ్రం చేశారు. రహదారుల వెంట పేరుకుపోయిన చెత్తాచెదారం, ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలు గడ్డి తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత గ్రామస్తుల అందరి బాధ్యత కావాలి అన్నారు. ఎవరి పరిసరాలను వారు పరిశుభ్రంగా ఉంచుకుంటే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. పరిశుభ్రత లక్ష్యంగా కమలాపూర్ గ్రామ సర్పంచ్ నిర్వహిస్తున్న ఊరు కోసం ఒక్కరోజు కార్యక్రమం అందరికీ ఆదర్శనీయమైనది. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై ఊరు బాగుకోసం ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాట్ల రమేష్, వార్డు సభ్యులు నాయకులు జన్ను బిక్షపతి, మార్క అశోక్, ఆవునూరి తిరుపతి, పిల్లి సతీష్, ఎండపెల్లి మల్లారెడ్డి, రాంశెట్టి రాజయ్య, తుమ్మ రాజేష్, గంధసిరి బిక్షపతి, పుల్ల శ్రీనివాస్, పుల్ల ఐలయ్య, తౌటం రవీందర్, మౌటం సంపత్, రాజవీరు గ్యాస్ ఏజెన్సీ చైర్మన్ మాట్ల రాజవీరు, మాట్ల ఐలయ్య, దేవయ్య, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం సభ్యులు, గరుడ గణపతి భజన మండలి సభ్యులు, యువతి యువకులు పాల్గొన్నారు.





