రాజకీయం

పరకాల బీజేపీ నాయకుల అరెస్ట్

తెలంగాణ గళం,సెప్టెంబర్ 7  పరకాల: రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు "ఫీజు బకాయి బీజేపీ లడాయి" కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన పరకాల బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చ…

By · · Updated

Share this article
పరకాల పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన బిజెపి నాయకులు

తెలంగాణ గళం,సెప్టెంబర్ 7 

పరకాల: రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు "ఫీజు బకాయి బీజేపీ లడాయి" కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన పరకాల బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈరోజు హైదరాబాద్ లో జరిగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్, జిల్లా కార్యదర్శి ఆర్.పి. జయంతీలాల్, పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు కుక్కల విజయకుమార్, ఆకుల లావణ్య శ్రీధర్, నాయకులు సంగా పురుషోత్తం, మిడిదోడ్డి నరేష్, బాసాని సోమరాజు తదితరులను పరకాల పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు.

Tags: