బిజినెస్

పండగ సీజన్‌లో వారికి బ్యాడ్ న్యూస్.. ఈ చక్కెర ధరలెంత పని చేశాయ్.. ఇలానే ఉంటే కష్టం!

  Sweets Price Hike: దేశంలో కొంత కాలంగా చక్కెర ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో పండగల సీజన్‌లో లడ్డూలు, స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు వంటి ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలు…

By · · Updated

Share this article
పండగ సీజన్‌లో వారికి బ్యాడ్ న్యూస్.. ఈ చక్కెర ధరలెంత పని చేశాయ్.. ఇలానే ఉంటే కష్టం!

 

Sweets Price Hike: దేశంలో కొంత కాలంగా చక్కెర ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో పండగల సీజన్‌లో లడ్డూలు, స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు వంటి ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు ఇప్పటికే ధరల పెంపుపై ఆలోచిస్తున్నాయంట. ప్రభుత్వం దిగుమతులు, స్టాక్ పరిమితులు వంటి చర్యలు తీసుకుంటున్నా, తయారీ ఖర్చులపై ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉంది.
Festive Season Prices Sugar Impact: ఇటీవలి కాలంలో దేశంలో షుగర్ (చక్కెర) ధరలు భారీగా పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసే ఉంటుంది. ఇది ఇప్పుడు పండగ సీజన్‌లో కస్టమర్లపై మరింత ఎఫెక్ట్ చూయించనుంది. సాధారణంగానే పండగల సీజన్ అంటే స్వీట్ల దగ్గర నుంచి మొదలుకొని చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, ఇతర తీపి పదార్థాల అమ్మకాలు భారీగా పెరుగుతుంటాయి. ఆగస్ట్ చివరి వారం నుంచి జనవరి వరకు దేశంలో చక్కెర వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం పండగల సమయంలో వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం చక్కెర ధరలు పెరగడమే. చక్కెరతో పాటు పాల ధరలు కూడా పెరగడంతో స్వీట్లు తయారు చేసే వ్యాపారులు, ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీల ఖర్చులు పెరుగుతున్నాయి.
ఈక్విరస్ సెక్యూరిటీస్ రిపోర్ట్ ప్రకారం చక్కెర ధరలు ఏడాది కిందటితో పోలిస్తే సుమారు 19 శాతం పెరిగాయి. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 20 శాతం పెరిగాయి. దీంతో బిస్కెట్లు, బేవరేజెస్, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి ఉత్పత్తుల తయారీ ఖర్చులపై ప్రభావం పడుతోంది. ఇక ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని చర్యల కారణంగా చక్కెర ధరలు కొంత మేర తగ్గాయి. అయినప్పటికీ గత నెలతో పోలిస్తే ఇంకా ఎక్కువగానే ఉన్నాయి.
దీంతో చక్కెర ఎక్కువగా ఉపయోగించే స్వీట్ల విభాగంలో ఉన్న కంపెనీలు ఇప్పటికే ధరల పెంపు దిశగా ఆలోచిస్తున్నాయి. బికాజీ ఫుడ్స్ (Bikaji Foods) తన స్వీట్స్ పోర్ట్‌ఫోలియోలో సుమారు 2 శాతం వరకు ధరల పెంపును అమలు చేస్తోందని కంపెనీ సీఎఫ్ఓ రిషభ్ జైన్ తెలిపారు. తయారీ ఖర్చుల భారాన్ని కొంత వరకు వినియోగదారులపైకి బదిలీ చేయాల్సి వస్తోందని చెబుతోంది.Read Also: "చక్కెర ధరలు ఎక్కువగానే ఉండాలి": మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయ్‌వర్గీయ సంచలన కామెంట్లుకంపెనీలకు ఇక్కడ ధర పెంచడమే కాకుండా మరో మార్గం కూడా ఉంది. అదే ఉత్పత్తి ధరను నేరుగా పెంచకుండా, ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గించడం. ఇప్పటికే ప్యాకేజ్డ్ ఫుడ్ పరిశ్రమలో ఇప్పటికే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంటే కస్టమర్లకు బయటకు చూస్తే ధరేం పెరగనట్లు కనిపించినా, అదే ధరకు తక్కువ పరిమాణంలో ప్రొడక్ట్ లభించే అవకాశం ఉంటుంది. చక్కెరతో పాటుగా పాల ధరలు కూడా పెరగడంతో మిఠాయిల తయారీ ఖర్చు ఇప్పటికే పెరిగింది. ఉదాహరణకు గతంలో కిలోకు రూ. 550- 560 గా ఉన్న పేడా ధర ఇప్పుడు రూ. 750- 780 వరకు చేరినట్లు మిఠాయి‌వాలా వ్యవస్థాపకుడు, సీఈఓ పర్మానంద్ శర్మ చెప్పారు. ఇతర స్వీట్ రకాలు కూడా ఇప్పటికే కనీసం 30 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది.
చక్కెర ధరల పెరుగుదలకు ముందే.. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముడి సరకుల ధరలు పెరగడంతో పలు ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరల్ని పెంచాయి. ఇందులో హిందుస్థాన్ యూనిలివర్, మారికో, డాబర్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు చక్కెర ధరలు పెరుగుతుండటంతో మరోసారి కంపెనీలపై భారం పడుతోంది. ఈ క్రమంలోనే ధరల పెంపును మళ్లీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.చక్కెర ధరలు పెరిగిన కారణంగా స్వీట్ల ధరలు పెరగడం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.క్లిక్ చేసి కామెంట్ చెయ్యండి

Tags: