Notification

ముగ్గురు మంత్రుల అడ్డాలో ... మారని ప్రభుత్వ ఆసుపత్రి తీరు

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి దారుణంగా మారింది కనీసం రోగులను పట్టించుకోలేని పరిస్థితి లో వైద్యులు ఉన్నారని ప్రజలు ఆవేదన చెందుతునారు.పేదవాడికి రోగం వస్తే గుర్తుకువచ్చేది ప్రభుత్వ ఆసుపత్రే గుర్తుకు…

By · · Updated

Share this article


ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి దారుణంగా మారింది కనీసం రోగులను పట్టించుకోలేని పరిస్థితి లో వైద్యులు ఉన్నారని ప్రజలు ఆవేదన చెందుతునారు.పేదవాడికి రోగం వస్తే గుర్తుకువచ్చేది ప్రభుత్వ ఆసుపత్రే గుర్తుకు వస్తుంది అలాంటి ఆసుపత్రి లో కనీసం తాగటానికి సరైన నీళ్ల సదుపాయం లేదు. సరైన పడకగదులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు
ప్రమాద స్థాయిలో భవనం :-
ఎన్నో సంత్సరాలు గా పెచ్చులు లేచిన గోడలు ఎ సమయంలో ఎలా ఉంటాదో అనీ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని దావకనానికి రావాల్సి వస్తుంది. వర్షాకాలం వచ్చింది అంటే వర్షపు నీరు అంత లోపాలకి వస్తాయని.. ఎంతమంది అధికారులు వచ్చిన చూసి చూడనట్లు వదిలేస్తారని ప్రజలు మోరపెట్టుకుంటున్నారు. పెచ్చులు లేచిన గోడలు శితిలావస్థనికి వచ్చిన ప్రభుత్వం పట్టించుకోవకపోవటం దారుణం
త్రాగునీరు సమస్యలు :- వేలాది మంది వచ్చే ఈ ఆసుపత్రి లో నీటి సమస్య వుంది అంటే ఖమ్మం లో అధికారుల తీరు ఎలా వుందో చెప్పొచ్చు, పాకూరు పట్టిన ట్యాంకులు, నల్లలు వాటిని చూస్తేనే లేని రోగాలు వస్తాయినట్లు ఇక్కడి పరిస్థితి.
వెయిటింగ్ హాల్ :-
వెయిటింగ్ హల్ కి వస్తే మేము వచ్చినపుడే మీరు వచ్చి వోచర్ తీసుకోవాలి అన్న తిరులో అక్కడి ఉద్యోగుల ప్రవర్తన, గంటల కొద్దీ వేచించుడాల్సిన పరిస్థితి . అంతే కాదు ఆసుపత్రి లో చాలా వరకు అన్నీ గదులకు తాళాలు వేసివుంటాడటం. సమయానికి వచ్చి ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్స్ ఏ విధి ఆలస్యం వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి, హాస్పిటల్ కి వచ్చిన వాహనాలు నిలపాలి అంటే లంచం పెట్టాల్సిన అవవసరం నెల్కొంది. ఇదేంటీ అనీ ఎవరు అయినా ప్రశ్నిస్తే భేదిరింపులకు దిగుతున్నారు అనీ ప్రజలు వాపోతున్నారు. ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభత్వం అనీ చెప్పుకునే ఈ ప్రజా పాలనలో ఎన్నో దారుణలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవటం లేదని ముగ్గురు మంత్రుల అడ్డా అయినా అర్థురూపాయి అంత అభివృద్ధి చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకానుంచి అయినా ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి సాధించి..ప్రభుత్వ నిధులు దూర్వీనయోగం చేస్తున్న అధికారులపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి.. ఆ అధికారులను, విధి నిర్వహణ లో నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ లను, నర్సలను విధులనుంచి తొలగించి వారిపై కఠిన చెర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు.

Tags: