మెట్‌పల్లి, అక్టోబర్ 08,తెలంగాణ గళం:
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. మెట్‌పల్లి పట్టణంలోని వెంకట్‌రెడ్డి గార్డెన్స్‌లో కోరుట్ల నియోజకవర్గానికి చెందిన 165 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.59,87,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ ఛైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులు అందుకోవడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు ఆర్థికంగా ఈ సహాయం ఎంతో తోడ్పడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపల్ ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.





