
మెట్‌పల్లి, అక్టోబర్ 05,తెలంగాణ గళం:
మెట్‌పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్‌లో హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానోత్సవం మూడు రోజుల కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మైలారపు లింబాద్రి హాజరయ్యారు.
అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ధ్యాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు, హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానంలో రిలాక్సేషన్, క్లీనింగ్, ప్రార్థన తదితర అంశాలపై కాన్హా హార్ట్‌ఫుల్‌నెస్ జోనల్ కోఆర్డినేటర్, రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీనారాయణ శాస్త్రి శిక్షణ అందిస్తున్నారు.
కార్యక్రమంలో కాన్హా జోనల్ కోఆర్డినేటర్ ప్రదీప్, జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ మంచాల కృష్ణ, ప్రిసెప్టర్‌లు దారం గోపి, రాజగోపాల్‌తో పాటు హార్ట్‌ఫుల్‌నెస్ అభ్యసీలు అల్లకట్టు సత్యనారాయణ, పడిగేల శ్రీనివాస్, దొంతుల పవన్, మహాజన్ నవీన్, పెండెం శివానందం, కంటాల ఆనందం, రమేష్, కన్నయ్య, లక్ష్మీ, కరుణ, నీరజ, పద్మ, రమ తదితరులు పాల్గొన్నారు.




