తాజా వార్తలు

మందమర్రిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

​మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతంలోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ రాం వేణు, ప్రిన్సిపాల్ ఏ. గుణవతి ఆధ్వర్యంలో జ…

By · · Updated

Share this article
మందమర్రిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

​మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతంలోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ రాం వేణు, ప్రిన్సిపాల్ ఏ. గుణవతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఉదయమే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్ననాటి శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలలో అందంగా ముస్తాబు చేసి పాఠశాలకు తీసుకువచ్చారు. చిన్నారులు జంటలుగా ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థిని విద్యార్థులు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ఎగిరి ఉట్టి కొట్టే ప్రయత్నం చేయడంతో పాఠశాల ప్రాంగణం కోలాహలంగా మారింది.

​ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఏ. గుణవతి మాట్లాడుతూ, తమ పాఠశాలలో ఏ పండుగ వచ్చినా విద్యార్థులకు మన సంప్రదాయాలు, సంస్కృతిని తెలియజేసే విధంగా ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు ఎంతగానో సహకరిస్తున్న పాఠశాల యాజమాన్యానికి, తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, భవిష్యత్తులోనూ ఇదే విధమైన సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏ. గుణవతితో పాటు రాం తిరుమల, శ్రీజ, షరీనా, స్పందన, శివాని, కృష్ణ మోహన్, శ్రీనివాస్, వెంకటస్వామి తదితర ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు

Tags: