హుజూరాబాద్ నియోజకవర్గం ఇంచార్జి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాలతో కమలాపూర్ మండలానికి ఆర్ డబ్ల్యూ ఎస్ క్రింద కోటి రూపాయలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝూన్సీరాణి వినతి సమర్పించారు. కమలాపూర్ మండలం కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీతో సహా మండలంలోని 23 గ్రామాలలో త్రాగునీటికి సంబంధించి పైప్ లైన్లు, బోర్ మోటార్స్, సైడ్ కెనాల్స్, తదితర పనుల పనుల నిమిత్తం మండల సర్వసభ్య సమావేశంలో మండలంలోని గ్రామ సర్పంచుల అభ్యర్థన మేరకు నిధుల మంజూరికై ఒడితల ప్రణవ్ బాబు దృష్టికి తీసుకెళ్లగా, వారి ప్రతిపాదనతో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బజ్పాయ్ ని కలిసి తక్షణమే కోటి రూపాయల నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించనైనది. ఈ సందర్భంగా ఝాన్సీ రాణి మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మరియు నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు ఎల్లప్పుడూ ముందుంటారని తెలియజేసినారు.
మండలానికి కోటి రూపాయలు మంజూరు చేయాలని వినతి
హుజూరాబాద్ నియోజకవర్గం ఇంచార్జి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాలతో కమలాపూర్ మండలానికి ఆర్ డబ్ల్యూ ఎస్ క్రింద కోటి రూపాయలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కి వ్యవసాయ మార్కెట్ కమి…
By తెలంగాణ గళం · · Updated
Share this article





