కమలాపూర్, తెలంగాణ గళం:
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన హన్మకొండ DCC సెక్రెటరీ, ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ మెంబర్ విష్ణుదాసు వంశీధర్ రావు తదనంతరం ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సతీమణి ఇనగాల అవంతి రెడ్డితో కలిసి ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనగాని శివకృష్ణ గౌడ్, DCC వైస్ ప్రెసిడెంట్ పోలేంపల్లి బుచ్చి రెడ్డి,రాయపురం సాంబయ్య,డివిజన్ అధ్యక్షుడు హరీష్ రెడ్డి,మరియు మహిళ కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



