తాజా వార్తలు

మహాత్ముడికి పాలకవర్గం నివాళి 

  కమలాపూర్, తెలంగాణ గళం:హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పంచాయతీలో గ్రామ సర్పంచ్ కదురు కవిత తిరుపతి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసిన నివా…

By · · Updated

Share this article
మహాత్ముడికి పాలకవర్గం నివాళి 

 

కమలాపూర్, తెలంగాణ గళం:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పంచాయతీలో గ్రామ సర్పంచ్ కదురు కవిత తిరుపతి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసిన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన అందించిన అసమాన సేవలను, ప్రపంచానికే దిశానిర్దేశం చేసిన అహింసా మార్గాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. మహాత్ముడి ఆశయాలు, సిద్ధాంతాలు కాలాతీతమైనవని, సమాజంలో శాంతి, సమరస్యాలను పెంపొందించడానికి ఆయన బోధించిన సూత్రాలు నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాడేం రాజేందర్, వార్డు సభ్యులు ఇనుగాల లత కృష్ణ, చేనుమల్ల సాంబరాజు,బత్తినీ కవిత రవి, వంగ రమేశ్, మల్యాల రజినీకర్, రావుల వాణీ వెంకటేశ్, ఎండి రజియా బేగం జెలీల్, కార్యదర్శి శ్రీనివాస్, ఆశా వర్కర్స్ కుసుంబ మౌనిక, నాయకులు రావుల సమ్మయ్య, బూర్గుల రాజేందర్, పులి మధు, ఉప్పుల కుమార్, మాస్ కిరణ్,  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: