కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై BRS నిరసన!
కమలాపూర్, తెలంగాణ గళం:
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల విఫల పాలనకు నిరసనగా, గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నేరెళ్ల గ్రామంలో రైతులు మరియు సబ్బండ వర్ణాల ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులను, గ్రామీణ ప్రజలను మరియు అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.



