తాజా వార్తలు

కల్యాణ లక్ష్మి.. పేదింటి ఆడబిడ్డకు భరోసా

12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇల్లందులో మాజీ సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం.. భారీగా పాల్గొన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇల్లందు, అక్టోబర్‌ 3 (తెలంగాణ గళం): కల్యాణ లక్ష్మి పథకం ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్…

By · · Updated

Share this article
కల్యాణ లక్ష్మి.. పేదింటి ఆడబిడ్డకు భరోసా

12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇల్లందులో మాజీ సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం.. భారీగా పాల్గొన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు

ఇల్లందు, అక్టోబర్‌ 3 (తెలంగాణ గళం): కల్యాణ లక్ష్మి పథకం ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇల్లందు జగదంబ సెంటర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ మహిళా నాయకుల ఆధ్వర్యంలో  మాజీ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు కల్యాణ లక్ష్మి పథకం ఆర్థిక భరోసా కల్పించిందన్నారు. రూ.1,00,116 ఆర్థిక సాయం అందించడం ద్వారా తల్లిదండ్రులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన యువతులకే పథకం వర్తించే నిబంధన ఉండటంతో బాల్యవివాహాల నివారణకు, ఆడపిల్లల చదువుకు ప్రోత్సాహం లభించిందన్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయడం ద్వారా మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మహిళా నాయకులు మదర్‌బీ లంజపల్లి, సులోచన, కె.భవాని, నూరి, సల్మా, గౌసియా, నారాయణమ్మతో పాటు టీజీబీకేఎస్‌ జనరల్‌ సెక్రెటరీ సుదర్శన రంగనాథ్‌, పట్టణ మాజీ అధ్యక్షుడు అబ్దుల్‌ జబ్బర్‌, మండల మాజీ అధ్యక్షుడు శీలం రమేష్‌, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్‌ భాహుసింగ్‌ నాయక్‌, రాచపల్లి శ్రీనివాసరావు, నారాపాక వసంత్‌, పరకపల్లి రవి, కిషన్‌ ప్రసాద్‌ పాసి, గాజీ, ఉపేందర్‌రావు, గోల్డ్‌ ఇమ్రాన్‌, గాడి శ్రీను, ఎస్‌కే అమీర్‌, లంజపల్లి రాంబాబు, జ్వాలా సాంబ, మునిగంటి శివ, ఎస్‌కే కమురు, సురేష్‌ సహు, తెలంగాణ ఉద్యమకారుడు రామ్‌లాల్‌ పాసి తదితరులు పాల్గొన్నారు.