రాజకీయం

​జనసేన ఫ్లెక్సీలను చింపడం పిరికితనానికి నిదర్శనం: నల్లతీగల మహేష్ కుమార్

మంచిర్యాలలో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు కుట్రపూరితంగా చింపివేయడం వారి పిరికితనానికి నిదర్శనమని ఆ పార్టీ జిల్లా నాయకుడు నల్లతీగల మహేష్…

By · · Updated

Share this article
​జనసేన ఫ్లెక్సీలను చింపడం పిరికితనానికి నిదర్శనం: నల్లతీగల మహేష్ కుమార్

మంచిర్యాలలో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు కుట్రపూరితంగా చింపివేయడం వారి పిరికితనానికి నిదర్శనమని ఆ పార్టీ జిల్లా నాయకుడు నల్లతీగల మహేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాలలో జనసేన పార్టీలోకి బీసీ బిడ్డ, ప్రముఖ వైద్యులు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ చేరడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే గిట్టనివారు ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన మండిపడ్డారు.

​ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి నిఘా ఉంచాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని జనసేన పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ తరఫున కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు ఆవుల సాగర్, మంచిర్యాల నియోజకవర్గ నాయకులు మజీద్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు

Tags: