హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగం.. అధికారులు పట్టించుకునేనా?
**వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల వాడకం.. భద్రతపై ఆందోళన**
ఉట్నూర్ హోటల్స్ లలో టిఫిన్ సెంటర్లలో వంటకాల తయారీకి వాణిజ్య (కమర్షియల్) గ్యాస్ సిలిండర్లను వినియోగించాల్సి ఉండగా, కొన్ని చోట్ల గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించి తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
హోటళ్లలో గ్యాస్ వినియోగంపై నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్న విషయాన్ని అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించడం వల్ల ప్రమాదాల ముప్పు పెరిగే అవకాశం ఉండటంతో పాటు, గ్యాస్ సరఫరా నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో గ్యాస్ సిలిండర్ల వినియోగం, భద్రతా ఏర్పాట్లు, అగ్నిమాపక పరికరాల అందుబాటు వంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
**వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ సిలిండర్లను ఉపయోగిస్తున్నారా? అనే అంశంపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.**





