తాజా వార్తలు

గోదావరి ఉగ్రరూపం.. పొంచి ఉన్న వరద ముప్పు!

31.40 అడుగులకు చేరిన నీటిమట్టం.. రేపు ఉదయానికి 38 అడుగులకు చేరే అవకాశం By Lakavath Sudhir  తెలంగాణ గళం సెప్టెంబర్ 26: భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం రాత్రి 8 గంటలకు నీటిమట్టం…

By · · Updated

Share this article
గోదావరి ఉగ్రరూపం.. పొంచి ఉన్న వరద ముప్పు!

31.40 అడుగులకు చేరిన నీటిమట్టం.. రేపు ఉదయానికి 38 అడుగులకు చేరే అవకాశం

By Lakavath Sudhir 

తెలంగాణ గళం సెప్టెంబర్ 26:

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం రాత్రి 8 గంటలకు నీటిమట్టం 31.40 అడుగులకు చేరగా, దిగువకు 4,83,801 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఇంద్రావతి పరివాహక ప్రాంతంలోని పాతగూడెం నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో తుపాకులగూడెం సమ్మక్క–సాగర్‌ వద్ద నీటి విడుదల 7.29 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ఆదివారం ఉదయానికి భద్రాచలం వద్ద నీటిమట్టం సుమారు 38 అడుగులకు చేరే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ భద్రాచలం ఎస్‌ఈ తెలిపారు. వరద ప్రవాహం కొనసాగితే నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags: