General

గెలుపు,ఓటములను సమానంగా స్వీకరించాలి. జిల్లా ఎస్పీ శబరీష్

గూడూరు సెప్టెంబర్ 10 (తెలంగాణ గళం) : గూడూరు మండలం జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల జోనల్ స్థాయి క్రీడా పోటీల ఎంపికల కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శబరీష్,ఐపీఎస్…

By · · Updated

Share this article
గెలుపు,ఓటములను సమానంగా స్వీకరించాలి.  జిల్లా ఎస్పీ శబరీష్

గూడూరు సెప్టెంబర్ 10 (తెలంగాణ గళం) : గూడూరు మండలం జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల జోనల్ స్థాయి క్రీడా పోటీల ఎంపికల కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శబరీష్,ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన,పట్టుదల, ఆత్మవిశ్వాసం,నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు శారీరక,మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని క్రీడా స్ఫూర్తి,క్రమశిక్షణ, నిరంతర సాధనే విజయానికి పునాదులని విద్యార్థులు చెడు మార్గాలు,మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.వ్యసనాలు యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున,ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుని విద్య,క్రీడలు,సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని తెలిపారు.విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో కార్యక్రమంలో సైబర్ మోసాలు,మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన పోస్టర్లను ప్రదర్శించారు.సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు,సందేశాలు, ఆన్‌లైన్ ఆఫర్లకు స్పందించవద్దని డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ వినయ్ కుమార్ ఎస్ఐ రమేష్ బాబు గూడూరు సర్పంచ్ సునీత కొమ్మలు నాయక్ పాఠశాల ఉపాధ్యాయలు తదితరులు పాల్గొన్నారు

Tags: