తాజా వార్తలు

దళితులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ఉట్నూర్: దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖా…

By · · Updated

Share this article

ఉట్నూర్: దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు దాసండ్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదు చేశారు.

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు దళితులు వచ్చిన ప్రాంతాలను పసుపు నీటితో శుద్ధి చేయాలని ఆదేశించారంటూ చేసిన వ్యాఖ్యలు దళితుల గౌరవాన్ని అవమానించేలా ఉన్నాయని వారు ఆరోపించారు.

ఈ అంశంపై బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు పావని గౌడ్, సంధ్యారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకులు కోరారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

దళితుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు దసండ్ల ప్రభాకర్  కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ నిసార్, జిల్లా ఆర్టీఏ మెంబర్ దూట రాజేశ్వర్, జైనూర్ మార్కెట్ వైస్ చైర్మన్ జైవంత్, ఎస్సీ సెల్ నాయకులు లాజర్, మహేందర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు పరమేశ్వర్, కాంగ్రెస్ నాయకులు కలీమ్, శ్రీనివాస్, ఆన్సర్ అలీ, ఫహీమ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: