*చిలికుంట చెరువుకు ఓ రియల్ సంస్థ డ్రైనేజీ పైపులైన్?
*అనుమతులు ఉన్నాయా? అధికారుల పర్యవేక్షణ ఏది?
రామచంద్రపురం మండలం, తెలంగాణ గళం న్యూస్ రిపోర్టర్ మన్నే మల్లేష్:-
తెల్లాపూర్ 263వ డివిజన్ పరిధిలోని ఉస్మాన్‌నగర్ ప్రాంతంలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ భవిష్యత్తు అవసరాల కోసం సుమారు కిలోమీటరుకు పైగా వ్యవసాయ భూముల గుండా పైపులైన్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. నాలుగు వంకల రోడ్లను దాటుకుంటూ, పైపులైన్‌ను ఉస్మాన్‌నగర్ పరిధిలోని చిలికుంట చెరువు కాలువలోకి కలిపేలా పనులు చేపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ పనులకు సంబంధించి అనుమతుల కోసం సంబంధిత అధికారులకు సంస్థ తరఫున వినతిపత్రం సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు అనుమతులు మంజూరు చేశారా? లేదా అనుమతులు రాకముందే పనులు ప్రారంభించారా? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే చిలికుంట చెరువు కాలువలోకి పైపులు వేసినట్లు సమాచారం. సాధారణంగా వ్యవసాయ పొలాల నుంచి వచ్చే వర్షపు నీరు సహజమైన వరద కాలువలు, పల్లపు ప్రాంతాల ద్వారా ప్రవహించే పరిస్థితి ఉండగా, కిలోమీటరుకు పైగా పైపులైన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
ఈ పనులకు సంబంధించి ఏ శాఖ అనుమతి ఇచ్చింది? పర్యావరణ, నీటిపారుదల, రెవెన్యూ లేదా స్థానిక సంస్థల నుంచి అనుమతులు ఉన్నాయా? అనే విషయాలను అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు తెరదించేందుకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

చెలికుంట చెరువుకు ఓరియల్ సంస్థ డ్రైనేజీ పైప్లైన్
*చిలికుంట చెరువుకు ఓ రియల్ సంస్థ డ్రైనేజీ పైపులైన్?*అనుమతులు ఉన్నాయా? అధికారుల పర్యవేక్షణ ఏది?రామచంద్రపురం మండలం, తెలంగాణ గళం న్యూస్ రిపోర్టర్ మన్నే మల్లేష్:-తెల్లాపూర్ 263వ డివిజన్ పరిధిలోని…
By తెలంగాణ గళం · · Updated
Share this article




