భారత ప్రధాని నరేంద్ర మోడీజీ జన్మదిన పురస్కరించుకుని సుపరిపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా కమలాపూర్ మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుండేడు గ్రామ సర్పంచ్ మేకల రవి దంపతులు అంగన్వాడీ టీచర్లను సత్కరించారు. ఈ సంధర్భంగా మండల అధ్యక్షులు రేకం శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకు అన్నప్రాసన మొదలుకొని అక్షరాభ్యాసం చేయిస్తూ పై తరగతులకు విద్యార్థులను తీర్చిదిద్దే మొదటి అడుగు అంగడి వాడి టీచర్ల నుండి ప్రారంభమవుతుంది అని కొనియాడుతు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు తుమ్మ శోభన్ బాబు, కనుకుంట్ల అరవింద్, మవుటం బాబు, జెట్టి సారంగపాణి, సీనియర్ నాయకులు నాసాని రాజు, గుండెడు గ్రామ ఉపసర్పంచ్ మురారి లక్ష్మీనారాయణ, మురారి రఘు, ఓదెలు, ఫిసాల రవీందర్, బూర శ్రీనివాస్, గుండెడు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడి టీచర్లకు సత్కారం
భారత ప్రధాని నరేంద్ర మోడీజీ జన్మదిన పురస్కరించుకుని సుపరిపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా కమలాపూర్ మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుండేడు గ్రామ సర్పంచ్ మేకల రవి ద…
By తెలంగాణ గళం · · Updated
Share this article





