తాజా వార్తలు

అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

    మెట్‌పల్లి, అక్టోబర్ 09,తెలంగాణ గళం:   మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో వాసవి టీచర్ ముదస్తూ బతుకమ్మ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శనివారం నుండి దసరా…

By · · Updated

Share this article
అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

 

 

మెట్‌పల్లి, అక్టోబర్ 09,తెలంగాణ గళం:

 

మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో వాసవి టీచర్ ముదస్తూ బతుకమ్మ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శనివారం నుండి దసరా సెలవుల నేపథ్యంలో ముందస్తు బతుకమ్మ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని అంగన్‌వాడీ కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ప్రత్యేకంగా అలంకరించారు.

 

ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ఈ సందర్భంగా వివరించారు. చిన్నారులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తూ పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు.

 

సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలు ఘనంగా ముగిశాయి.