కమలాపూర్, తెలంగాణ గళం:
కమలాపూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు తూము నుండి అక్రమంగా నీటిని గుర్తు తెలియని వ్యక్తులు వదులుతున్నారని సమాచారంతో తూమును కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడతూ కమలాపూర్ పెద్ద చెరువు నీరును సుమారు 16 గ్రామాలకు తాగు సాగు కోసం ఉపయోగిస్తారన్నారు. ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడినందున ఎవరైనా అక్రమంగా తూము నుండి నీటిని వదిలేస్తే వారిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ దుశ్చర్య వల్ల రాబోయే వేసవి కాలంలో త్రాగడానికి నీరు దొరకదని చెప్పారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో తూముకు తాళం వేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాగరాజు, మల్లారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.





