తాజా వార్తలు

12వ వేజ్ బోర్డులో బొగ్గు పెన్షనర్ల సమస్యలు చేర్చాలి: సింగరేణి విశ్రాంత ఉద్యోగుల డిమాండ్

​మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్, ఎల్‌ఐసీ కాలనీ మరియు ఐబీ ఏరియాల్లో సింగరేణి విశ్రాంత కార్మికులతో సమావేశం నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా ఎలాంటి పెంపునకు నోచుకోని కోల్ మైన్స్ పెన్షన్‌ను, కరువ…

By · · Updated

Share this article
12వ వేజ్ బోర్డులో బొగ్గు పెన్షనర్ల సమస్యలు చేర్చాలి: సింగరేణి విశ్రాంత ఉద్యోగుల డిమాండ్

​మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్, ఎల్‌ఐసీ కాలనీ మరియు ఐబీ ఏరియాల్లో సింగరేణి విశ్రాంత కార్మికులతో సమావేశం నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా ఎలాంటి పెంపునకు నోచుకోని కోల్ మైన్స్ పెన్షన్‌ను, కరువు భత్యంతో కూడిన 50 శాతం పెంచే విధంగా, అలాగే అతి తక్కువ పెన్షన్ పొందుతున్న బొగ్గు పెన్షన్దారులకు కనీస పెన్షన్ రూ. 15,000గా ఇచ్చేలా 12వ వేజ్ బోర్డు చర్చల్లో డిమాండ్ చేయాలని సింగరేణిలోని 5 జాతీయ కార్మిక సంఘాల నాయకులను విశ్రాంత ఉద్యోగులు కోరారు. అలాగే సీపీఆర్‌ఎంఎస్ (CPRMS) వైద్య సౌకర్యాలకు రూ. 8 లక్షలకు బదులు రూ. 25 లక్షలు చెల్లించాలని, పెరిగిన గ్రాడ్యూటీ సీలింగ్‌ను అధికారుల మాదిరిగానే 2017 నుంచే విశ్రాంత ఉద్యోగులకు చెల్లించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో విశ్రాంత ఉద్యోగులకు ఓటు హక్కు లేదనే ఉద్దేశంతో తమ సమస్యలను పట్టించుకోకపోతే, కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 15,000 నుండి 16,000 మంది తమ కుటుంబ సభ్యుల ద్వారా రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాబోయే బుధవారం రోజున ఉదయం 09 గంటలకు నస్పూర్‌లోని సింగరేణి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ మహా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

​ఈ సమావేశంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షులు రాళ్ళబండి రాజన్న, ఉపాధ్యక్షులు ఎన్. సదాశివ చారి, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, సలహాదారుడు హనుమంత రావు, నాయకులు ఇరుకుళ్ల జనార్దన్, సంగెం రాంచందర్, బి. జ్ఞాని, ఆర్. పర్వతాలు మరియు ఎల్‌ఐసీ కాలనీ, రామ్‌నగర్‌కు చెందిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Tags: